సౌత్ సినిమా స్టాండేడ్ పెంచిన సినిమాల్లో బాహుబలి సీరీస్ మొదటిది అయితే కేజీఫ్ సినిమా రెండోది…ఈ సినిమాల తర్వాతనే సౌత్ సినిమాలు అంటే ఎంటో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి తెలిసింది.వీటితో ప్రారంభమైన పాన్ ఇండియా సినిమాల హవా ఇప్పటికీ అలానే కొనసాగుతుంది.
అయితే ఈ సినిమా అనేది అసలు సినిమానే కాదు అంటూ ఒక రెండు చిన్న సినిమాలు తీసిన డైరెక్టర్ అయిన వెంకటేష్ మహా ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు…ఆయన నార్మల్ గా నాకు ఈ సినిమా నచ్చలేదు అని చెపితే ఇది పెద్ద కాంట్రవర్సీ కాకుండా ఉండేది కాని ఆయనొక డైరెక్టర్ అయి ఉండి ఆ సినిమా గురించి హేళన గా మాట్లాడం నిజం గా సినిమా అభిమానులకి చాలా భాదని కలిగించింది.

ఒక డైరెక్టర్ అయి ఉండి తోటి డైరెక్టర్ తీసిన సినిమాల గురించి ఎలా మాట్లాడాలో కూడా తెలీదు అంటూ వెంకటేష్ మహా పైన సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది.అయితే ఈయన వెకిలిగా కెజీఫ్ సినిమా గురించి చెప్తుంటే ఆ టైం కి పక్కన కూర్చుని నవ్వుతున్న డైరెక్టర్స్ ఎవరెవరు అంటే అందులో ఒకరు వివేక్ ఆత్రేయ, ఇంద్రగంటి మోహన కృష్ణ,నందిని రెడ్డిలు నవ్వుతూ కనిపించారు కానీ వెంకటేశ్ మహా పక్కనే కూర్చున్న శివ నిర్వాణ మాత్రం నవ్వకుండా కామ్ గా ఆయన మాట్లాడేది వింటు కూర్చున్నాడు.

వెంకటేష్ మహా అనే డైరెక్టర్ ఆయనకి మిగితా డైరెక్టర్స్ పట్ల అంత మాత్రం గౌరవం లేకపోతే ఎలా ఈయన కేరాఫ్ కంచరపాలెం అనే సినిమా తీశాడు ఓకే అది మంచి సినిమానే ఒప్పుకుంటాం, కానీ ఒక సౌత్ సినిమా స్టాండర్డ్ ని చూపించిన సినిమా పట్ల అంత హేళనగా మాట్లాడకూడదు అంటూ కేజీఎఫ్ సినిమా హీరో అయిన యశ్ అభిమానులు వల్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీద ఇప్పటికే వెంకటేష్ మహా స్పందిస్తూ సారీ కూడా చెప్పాడు…
.







