డార్లింగ్ సినిమా ని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అంటే ఒక స్టార్ హీరో… కానీ ప్రభాస్ కెరీయర్ స్టార్టింగ్ లో హిట్స్ కొట్టడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు, అప్పుడు ఆయనకి వరుసగా హిట్స్ రాలేదు మొదటి రెండు సినిమాలు అయిన ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలతో ఫెయిల్ అయిన ప్రభాస్ వర్షం సినిమాతో హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఛత్రపతి సినిమా వచ్చేదాకా మధ్యలో అన్ని ప్లాప్ లే వచ్చాయి ఛత్రపతి తరువాత కూడా ఆయన చేసిన చాలా సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి అప్పుడు డైరెక్టర్ కరుణాకరన్ తీసిన డార్లింగ్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది.ఇక అక్కడి నుంచి ప్రభాస్ హిట్టు మీద హిట్టు కొడుతూ వచ్చాడు అయితే ప్రభాస్ కెరియర్ లో ఎన్ని సినిమాలు తీసిన ఆయన ఫ్యాన్స్ కి మాత్రం ఇప్పటికీ డార్లింగ్ సినిమా అంటేనే ఇష్టం అందులోనే ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉంటాడు యాక్టింగ్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది…

 Ram Charan Missed The Darling Movie Details , Ram Charan ,darling , Prabh-TeluguStop.com

ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా ప్రభాస్ కంటే ముందే ఒక స్టార్ హీరో దగ్గరికి వెళ్ళింది ఆయన దాన్ని రిజెక్ట్ చేయడం తో మళ్ళీ ప్రభాస్ దగ్గరికి వచ్చింది ఆ స్టార్ హీరో ఎవరంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంట అవును మీరు విన్నది నిజమే ఈ స్టోరీని కరణకరన్ మొదట రామ్ చరణ్ కి చెప్పారట అయితే అప్పుడే మగధీర సినిమా తీసి హిట్ కొట్టిన చరణ్ అప్పటికే ఆరెంజ్ సినిమా చేస్తున్నాడు అది కూడా సాప్ట్ సినిమా మళ్ళీ వెంటనే డార్లింగ్ లాంటి ఇంకో సాప్ట్ సినిమా వద్దని దాన్ని సున్నితం గా రిజెక్ట్ చేశాడు.

దానితో ఈ సినిమా స్టోరీ ని కరుణాకరన్ ప్రభాస్ కి చెప్పి ఆయనతో సినిమా చేశాడు అది చాలా పెద్ద హిట్ అయింది ఈ సినిమా కనక రామ్ చరణ్ చేసి ఉంటే ఆయన కెరియర్ లో ఒక డీసెంట్ హిట్ ఫిల్మ్ గా ఈ సినిమా మిగిలిపోయేది అని ఆయన ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు… నిజానికి ఈ సినిమాతోనే ప్రభాస్ కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అని చెప్పాలి ఈ సినిమా తరువాత చేసిన మిస్టర్ పెర్ఫెక్ట్ మిర్చి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి…

 Ram Charan Missed The Darling Movie Details , Ram Charan ,Darling , Prabh-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube