దళిత బంధును దగా చేసిన ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలి...!

సూర్యాపేట జిల్లా: దళితులను ఆదుకుంటామని దళిత బంధు పథకాన్ని పెట్టామని చెప్పి,దానిపై అధికారుల అజమాయిషీ లేకుండా ఎమ్మెల్యేలకు అధికారం అప్పగించి,ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటని,అవినీతికి పాల్పడ్డ వారి వివరాలు తన దగ్గర ఉన్నాయని చెప్పడం కాదని,వారి వివరాలు బయట పెట్టి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్పీ) సూర్యాపేట జిల్లా( Suryape ) ఇన్చార్జి యాతాకుల రాజన్న మాదిగ డిమాండ్ చేశారు.మహాజన నేత మందకృష్ణ మాదిగ ( Manda Krishna Madiga )పిలుపు మేరకు దళిత బంధు( Dalit Bandhu ) అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీసు వద్ద ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర సాధనలో సకల జనులలో సగ భాగమైన దళితులు కొట్లాడి సాధిస్తేనే తెలంగాణ సాకారమైందని, అలాంటి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంలో తమ పార్టీ ఎమ్మల్యేలు అవినీతికి పాల్పడ్డారనికేసీఆర్ ప్రకటించి నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం దౌర్భాగ్యమన్నారు.

 Criminal Cases Should Be Filed Against The Mlas Who Lied To A Dalit Bandhu...! ,-TeluguStop.com

దళిత బంధు పథకంలో రూ.2 నుండి రూ.3 లక్షలు లంచం తీసుకున్న ఎమ్మెల్యేల చిట్టాను ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేయాలని, వారిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు.దళిత బంధులో అవినీతి పాల్పడిన ఎమ్మెల్యేల వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర గవర్నర్ తెప్పించుకోవాలని కోరారు.

దళిత బంధులో ఎమ్మెల్యేలు అవినీతి చేశారని,ఆ చిట్టా తన వద్ద ఉందని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకోని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి,వారిని వచ్చే ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బొజ్జ సైదులు మాదిగ,నాయకులు కనుకుంట్ల వెంకన్న మాదిగ,మహాజన మహిళా సమైక్య సూర్యాపేట టౌన్ అధ్యక్షురాలు పిడమర్తి నాగేశ్వరి,నాయకులు దైదా వెంకన్న మాదిగ, తాటిపాముల నవీన్ మాదిగ,చింతా వినయ్ బాబు మాదిగ,మిరియాల చిన్ని మాదిగ,కంకణాల శ్రీనివాస్,ఉప్పల నాగార్జున మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube