ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలి:ధర్మా ర్జున్

సూర్యాపేట జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ దళారీ పాలనకు వ్యతిరేకంగా,ఉద్యమ ఆకాంక్షల సాధనకై తెలంగాణ అమరుల స్ఫూర్తితో మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ జనసమితి రాష్త్ర ప్రథాన కార్యదర్శి ధర్మార్జున్ పిలుపు నిచ్చారు.తెలంగాన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారులతో కలిసి అమరుల స్మృతి దీపం కాగడాల ప్రదర్శన నిర్వహించారు.

 Be Prepared To Fight For Self-respect: Dharma Rjun-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల దోపిడీ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.నీళ్ళ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.

అమరుల త్యాగంతో సాధించుకున్న రాష్ట్రంలో మళ్ళీ సీమాంద్ర కాంట్రాక్టర్లకు పెద్దపీట వేస్తూ అమరుల త్యాగాలను అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ కేసీఅర్ తెలంగాణను జైలుగా మార్చి,ప్రజలను ఖైదీలుగా చేసి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో జనసమితీ రాష్త్ర నాయకులు గట్ల రమాశంకర్,సిపిఐ (ఎంఎల్)నాయకులు బుద్ద సత్యనారాయణ.బిసిపి నాయకులు చామకుర నర్సయ్య,నారబొయిన కిరణ్, కుంచం చంద్రకాంత్,బందన్ నాయక్,ఖలీల్,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube