సూర్యాపేట జిల్లా:మోతె మండల పరిధిలోని నర్సింహపురం,రంగాపురం తండా గ్రామ శివారులోని పాలేరు వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్లను గురువారం మోతె ఎస్ఐ యాదవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నారు.
నమ్మదగిన సమాచారం మేరకు 13 వ,తేదీ ఉదయం సుమారు 4 గంటల సమయంలో పట్టుబడి చేసి కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ వాగుకు ఇసుక ట్రాక్టర్లు రాకుండా స్థానికులు రహదారులను జేసిబితో గుంతలు తవ్వారు.