గోదావరి కాళేశ్వరం జలాలతో వ్యాపారాలు అభివృద్ధి

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక గోదావరి కాలేశ్వరం జలాలతో పాడిపంటలు పండి తెలంగాణలో వ్యాపారాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.

శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన తేజ్ హోటల్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

సూర్యాపేట జిల్లా అయిన తర్వాత వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.విద్యార్థులకు ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో హోటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణానికి పనుల నిమిత్తము వచ్చే వారికి హోటల్ల అవసరం ఎంతో ఉందన్నారు.హోటల్ యజమానులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్నారు.

లాభాపేక్ష కాకుండా సేవాభావంతో వ్యాపారాలు నిర్వహించాలన్నారు.ప్రపంచంలోని ఎన్నో బడా కంపెనీలు తెలంగాణలో వ్యాపారాలు పెట్టుటకు ముందుకు వస్తున్నాయని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ప్రణాళికలే కారణమన్నారు.

Advertisement

మంత్రి జగదీశ్ రెడ్డి సారధ్యంలో సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా టిఆర్ఎస్ నాయకులు గుడిపూడి వెంకటేశ్వరరావు,డాక్టర్ రామమూర్తి,కొండపల్లి బద్రమ్మ సాగర్ రెడ్డి,మీలా వంశీ,హోటల్ యజమాని గోరుగంటి రఘు తదితరులు పాల్గొన్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

Latest Suryapet News