సూర్యాపేట జిల్లా:ఆర్థికంగా,విద్యారంగ పరంగా వెనకబడ్డ కుమ్మరి కులాన్ని బీసీ-బి నుండి ఎస్టీ జాబితాలోకి మార్చాలని సూర్యాపేట జిల్లా కుమ్మరి (శాలివాహన) నాయకులు కొలిచలం శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కుమ్మరి కులాన్ని కేంద్ర ప్రభుత్వం గానీ,రాష్ట్ర ప్రభుత్వాలు గానీ పట్టించుకోకపోవడంతో సంచారం జాతలుగా నివసిస్తున్న కుమ్మరులు అన్ని రకాలుగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.మట్టి నమ్ముకుని పనిచేస్తున్న కుమ్మరి కులాన్ని అవహేళన చేస్తూ కుమ్మరి వృత్తిని అవమానిస్తున్నారని,గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న కుమ్మర్లును కులం పేరుతో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ కులాన్ని అవహేళన చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మట్టిని కుండగా మార్చే నైపుణ్యం కొన్ని వందల వేల క్రితమే నాగరికత నేర్పిన కులం కుమ్మరులదని, కొన్ని వందల వేల క్రితం మట్టి కుండ లేనిదే మనుగడ లేదని గుర్తు చేశారు.
అలాంటి గొప్ప సంస్కృతి కుమ్మరి సంస్కృతి అని,ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆర్థికంగా, రాజకీయంగా,విద్యారంగ పరంగా,వృత్తిపరంగా నష్టపోయిన కుమ్మరి కులంపై ప్రత్యేక దృష్టి సారించి,సంచార జాతులుగా ఉన్న కుమ్మరలను ఎస్టీ జాబితాలోనికి మార్చాలని కోరారు.