సూర్యాపేట జిల్లా:సమాజాన్ని ఉద్ధరించే బాధ్యత గల ప్రభుత్వ ఉపాధ్యాయుని వృత్తిలో ఉంటూ భార్య చనిపోవడంతో మరో మహిళతో సహజీవన కొనసాగిస్తూ ఆమె ఇద్దరి ఆడపిల్లలపై కన్నేసి తల్లికి, పిల్లలకు సెక్స్ వల్ ట్రాన్స్ మిషన్ డిషిజ్ అనే ఇంజక్షన్ ఇచ్చి ముగ్గురిని వశ పరుచుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించిన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్థానిక హైస్కూల్లో విధులు నిర్వహిస్తున్నాడు.
కొన్నేండ్ల క్రితం అతని భార్య మరణించడంతో ఒంటరిగా ఉంటున్నాడు.ఈ క్రమంలో అతడికి భర్తతో విడిపోయిన ఓ మహిళతో 2018 లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది.
అప్పటి నుంచి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.అయితే ఆ మహిళకు అప్పటికే 19,15 ఏళ్ల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
వాళ్లు కూడా తల్లితోనే ఉంటున్నారు.
కూతుళ్ళుగా చూసుకోవాల్సిన ఇద్దరు అమ్మాయిలపై కన్నేసి,తల్లి లేని సమయంలో గత రెండేళ్ళుగా ఇద్దరి అమ్మాయిలపై ఇంజక్షన్ ప్రయోగించి అత్యాచారానికి పాల్పడుతూ ఈ విషయం తల్లికి చెప్తే చంపేస్తానని బెదిరించినట్లు తల్లి పోలీసులను ఆశ్రయించడం జిల్లాలో కలకలం రేపింది.
ఇటీవల అతను ఆమెకు దూరంగా ఉండడంతో ఇంతకాలం మౌనంగా ఉన్నా బాలికలు తమపై అత్యాచారం చేశాడనే విషయాన్ని చెప్పడంతో తల్లి షాక్ కు గురై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.సదరు మహిళ ఫిర్యాదుతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు,అతడిని అదుపులోకి తీసుకుని,తల్లీ ఇద్దరు కూతుళ్ల నుండి రక్తం పరీక్ష చేసేందుకు శాంపిళ్లను సేకరించి ల్యాబ్ పంపినట్లు సమాచారం.