సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలం దోసపహడ్ గ్రామంలో కీత పిచ్చమ్మ అనే వృద్ధురాలి మెడలోని రెండుతులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు లాక్కెళ్లిన ఘటన గురువారం చోటు చేసుకుంది.
బైక్ పై వచ్చిన ఇద్దరు కల్లు బాటిల్ మీ వాళ్లదే ఇస్తావా అని మాట కలిపి మెడలో ఉన్న బంగారు గొసులును తెంచుకొని నారాయణ మిల్లు వైపు పరారయ్యారని పిచ్చమ్మ లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంది.