అమెరికా ప్రభుత్వ యంగ్ పొయెట్ రాయబారిగా సూర్యాపేట బిడ్డ

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన ఓ సామాన్య రైతు కీత నాగేశ్వరరావు బిడ్డ కీత విధాత్రికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.చిన్న తనం నుండే ఎంతో కష్టపడి చదువుతూ అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణం.

 Suryapet's Child As The Young Poet Ambassador Of The Us Government-TeluguStop.com

అమెరికా ప్రభుత్వం నిర్వహించిన యంగ్ పోయెట్ రాయబారి సెలక్షన్ లో పాల్గొన్న ఐదు లక్షల మంది విద్యార్థులలో విధాత్రి టాప్ 5 గా నిలిచింది.దీనితో అమెరికా ప్రభుత్వం విధాత్రిని యంగ్ పొయెట్ రాయబారిగా నియామకం చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా అమెరికా దేశ అధ్యక్ష భవనం వైట్ హౌజ్ నందు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ విధాత్రికి మెడల్ బహూకరించి,అమెరికా ప్రభుత్వం నుండి 5000 డాలర్ల పారితోషికం అందజేసి సత్కరించడం జరిగిందన్నారు.మన భారత సంతతికి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా,గరిడేపల్లి మండల విద్యార్థిని ఈ ఘనత సాధించడం పట్ల యావత్ దేశంతో పాటు స్వరాష్ట్ర ప్రజలు,సొంత జిల్లా,మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube