అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా:సెలవు రోజులలో టిహెచ్ఆర్ ఇచ్చుటకు అనుమతి ఇవ్వాలని టిఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ,అంగన్వాడీ టీచర్స్ &హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాటిపాముల నాగలక్ష్మి,విలాసకవి నిర్మల,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంతెనపల్లి సుజాత శనివారం డిడబ్ల్యూఓ జ్యోతిపద్మకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా గురూజీ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు,ప్రీస్కూల్ పిల్లలు ఎండ తీవ్రత వలన సెంటర్స్ కు రావాలంటే భయపడుతున్నారని,చిన్న పిల్లలకు వడదెబ్బ తగిలే అవకాశం ఉందని,కాబట్టి ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడి కేంద్రాలకు కూడా వేసవి సెలవులు ప్రకటించాలని కోరారు.

 Summer Vacations Should Be Given To Anganwadi Centers-TeluguStop.com

ఆయా లేని,టీచర్స్ లేని సెంటర్స్ లో పని చేసే వారికి సెలవులు ఇవ్వడం లేదని అన్నారు.కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్ లు టీచర్స్ కు ఇవ్వడం వలన అదనంగా పనిభారం పెరిగిందని,చాలా మంది టీచర్స్ ఫోన్ ఆఫరేటింగ్ రాక ఇబ్బంది పడుతున్నారని,మరో ప్రక్క రికార్డు కూడ రాయడం ఉండడంతో డబల్ పని అవుతున్నదని తెలిపారు.

అందుకే స్మార్ట్ ఫోన్ ను ప్రామాణికంగా తీసుకోవద్దని అన్నారు.టీచర్స్,హెల్పర్స్ చనిపోతే మట్టి ఖర్చుల కొరకు 20 వేలు,రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్స్ 5లక్షలు,ఆయాకు 3లక్షలు ఇవ్వాలని,రిటైర్ అయిన టీచర్,ఆయా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని,కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం పెంచాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు కమల,తయ్యాభ, సోమగాని రమణ,అనసూర్య,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube