సూర్యాపేట జిల్లా:మలేషియా దశాబ్ది ఉత్సవాల్లో సూర్యాపేట జిల్లాకు చెందిన డప్పు కళాకారుడు అమరవరపు సతీష్ బృందం డప్పు మోత మోగించారు.మైట మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న తెలంగాణ 10 ఏళ్ల పండుగ ప్రోగ్రాం కోసం మైటా ఆహ్వానం మేరకు ఉస్తాద్ పెరణి రాజ్ కుమార్ పెరణి నృత్యం,అందె డప్పు భాస్కర్ ఉస్తాద్ బృందం వీరిద్దరి బృందం సభ్యుడు అమరవరపు సతీష్ తమ డప్పు దరువుతో మలేషియాలో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ మరియు ప్రపంచ ప్రఖ్యాతి కంచిన ట్విన్ టవర్స్ ముందు అద్భుతం నిర్వహించిన
మలేషియా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలల్లో అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించారు.
వీరి బృందాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు.వీరు తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ ప్రోద్బలంతో ముందుకు పోతున్నారు.పల్లెల గల్లీ నుండి విదేశీ ఖండతారాలకు విశ్వవేదిక మీద వీరు చేస్తున్న కృషిని అభినదిద్దాం,వీరికి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలని కోరుకుందాం.