యాదాద్రి భువనగిరి జిల్లా:శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా జరుగాయి.బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఆలయ తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి, భక్తులను కనువిందు చేశారు.
వివిధ రకాల పూలతో అలంకరించిన స్వామివారిని వేద మంత్రాలు,మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరు వీధుల్లో విహరింపజేశారు.ఊరేగింపు అనంతరం వేంచేపు మండపంలో అర్చకులు పూజలు నిర్వహించారు.