నల్లగొండ జిల్లా: కుటుంబంలో ఏర్పడిన సమస్యలకు మనస్తాపం చెందిన ఓ వివాహిత బుధవారం రాత్రి నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైంది.ఇది గమనించిన స్థానికులు టూటౌన్ ఎస్ఐ సైదులుకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి ఆయన 100 కాల్ సిబ్బందిని అప్రమత్తం చేసి, కానిస్టేబుళ్లు నాగరాజు,సతీష్ లను ఘటనా ప్రాంతానికి పంపించారు.
హుటాహుటిన అక్కడ చేరుకొన్న సిబ్బంది చాకచక్యంగా ఆమెను కాపాడి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారు.
రాత్రి సమయం కావడంతో సదరు మహిళను స్థానిక సఖీ సెంటర్ కు తరలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఉదయం ఎస్ఐ సైదులు కుటుంబ సభ్యులను పిలిపించి ఆమెకు మరియు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేసిన అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.సమాచారం అందగానే ఉన్నఫళంగా స్పందించి ఓ మహిళ ప్రాణాన్ని కాపాడిన టూ టౌన్ పోలీసు పని తీరుపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.