యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంభావితండా గ్రామానికి చెందిన పానుబోతు గోవర్ధన్ గత పదేళ్ల నుండి మంచానికి పరిమితమై విషయం తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ యాదాద్రి జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ చలించిపోయారు.ఆ యువకునికి కాంగ్రెస్ కార్యకర్తలు,కుటుంబ సభ్యుల సమక్షంలో వాటర్ బెడ్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ఫూర్తితో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలిచి ఆదుకుంటానని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గోవర్ధన్ కుటుంబానికి అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కరంటోత్ శ్రీనివాస్ నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు భిక్షపతి నాయక్, గుత్తా ప్రేమ్ చందర్ రెడ్డి,ఏపూరి సతీష్,దోనూరు జైపాల్ రెడ్డి, జక్కిడి జంగారెడ్డి,మన్నే నర్సిరెడ్డి, రమణారెడ్డి,బాలు నాయక్, మాధవరెడ్డి,ఉప్పల నాగరాజు, రాచకొండ రమేష్, బద్ధుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.