యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ అన్నదాతలను మోసం చేస్తుందని వైఎస్ఆర్ టిపి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అతహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లాలో కొనసాగుతున్న అప్రకటిత కరెంట్ కోతలను నిరసిస్తూ,రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
అనంతరం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వాలని డీఈ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న చిన్నకారు రైతుల వరి పొలాలు పొట్ట దశలోకి వచ్చిన నేపథ్యంలో కరెంట్ అప్రకటిత కోతల వలన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందనిఅన్నారు.
పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని,24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితికి కారణమేమిటో చెప్పాలని ప్రశ్నించారు.ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
.