నల్లగొండ జిల్లా:రెక్కల కష్టంతో భూమి కొనుక్కొని, వ్యవసాయం చేసుకుంటూజీవిస్తున్న గన్యా నాయక్ భూమిని లాక్కొనే ప్రయత్నంలో అతనిని భయబ్రాంతులకు గురి చేసి,సోమవారం దారుణంగా హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి,బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఎస్పీ నేత రామావత్ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు.దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని డిండి మండలం జేత్య తండా గ్రామపంచాయతీకి చెందిన గిరిజన రైతు గన్యా నాయక్ ను హత్య చేసిన వారిని వెంటనెే అరేస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి ముందు జాతీయ రహదారిపై కుటుంబసభ్యులతో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా అయన మాట్లడుతూ హత్యకు గురైన రామావత్ గన్యా నాయక్ గత 30 సంవత్సరాల కిందట 4 ఎకరాల భూమి కొనుక్కొని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని,ఆ గిరిజన రైతు భూమిపై కన్నేసిన అగ్రకులానికి చెందిన కొట్టం నాగార్జున రెడ్డి,కొట్టం రాజశేఖర్ రెడ్డి, కొట్టం సుధాకర్ రెడ్డిలు దౌర్జన్యంగా అతని భూమిని లాక్కోడానికి ప్రయత్నించి,రైతును భయభ్రాంతుల గురిచేసి, అన్యాయంగా హత్య చేశారని ఆరోపించారు.
హత్య చేసిన కొట్టంరెడ్డి అన్నదమ్ములపై కేసు పెట్టి కఠినంగా శిక్షించి,బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకుండా రెడ్లకే సపోర్ట్ చేయడం ఎంతో బాధాకరమని అవేదన వ్యక్తం చేశారు.
ఒక గిరిజన ఎమ్మెల్యే ఉండి కూడా గిరిజనులకు సపోర్ట్ చేయకుండా ఈరోజు ఒక ప్రాణం పోయేవిధంగా ప్రోత్సహించిన స్థానిక ఎమ్మెల్యే సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఎస్పీ అండగా ఉంటుందని అన్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు
.