సూర్యాపేట జిల్లా: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలతో జరిగిన నష్టంపై శాఖల వారీగా SDRF/NDRF నిబంధనల ప్రకారం రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని కోదాడ మున్సిపాల్టీలో వరదలతో యర్రమళ్ళ వెంకటేశ్వర్లు, నాగం మురళికృష్ణ మరణించారని,వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుపున ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందజేయటం జరిగిందని అన్నారు.పశు సంవర్ధన శాఖ ద్వారా 4 ఎద్దులు,20 గేదెలు,3 ఆవులు,22 గొర్రెలు/మేకలు,105 కోళ్లు మరణించాయని వాటికి నష్ట పరిహారం కింద 13.085 లక్షల రూపాయలు అంచనా వేయటం జరిగిందన్నారు.
హౌజింగ్ శాఖ ద్వారా వరదల వల్ల పూర్తిగా 7 కచ్చా ఇల్లులు కూలాయని,2 పక్కా ఇల్లులు,2 కచ్చా ఇల్లులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 28 ఇండ్ల పైకప్పులు గోడలు కూలాయని,4910 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని,ఇంటికి రూ.16500 చొప్పున 8.16 కోట్ల రూపాయలు నష్ట పరిహారం అంచనా వేయటం జరిగిందన్నారు.
మత్స్య శాఖ ద్వారా 3 చెరువులలో 71 టన్నుల చేపలు,అలాగే 31 పడవలు వరదలో కొట్టుకోనిపోయాయని వాటికి 1.13 కోట్ల రూపాయల నష్ట పరిహారం అంచనా వేయటం జరిగిందన్నారు.వ్యవసాయ శాఖ ద్వారా జిల్లాలో 33% కన్నా ఎక్కువ పంట నష్టం 9068.72 హెక్టార్లలో 14.43 కోట్ల రూపాయల పంట నష్టం అంచనా వేయటం జరిగిందన్నారు.పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 126 రోడ్ల తాత్కాలిక మారమ్మతులకు 7.21 కోట్లు 61 కల్వర్ట్ లు/బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని వాటికి మరమ్మత్తు చేయుటకు 36.6 లక్షల రూపాయల నష్టం అంచనా వేయటం జరిగిందన్నారు.రోడ్లు, భవనాల శాఖ ద్వారా రాష్ట్ర రోడ్లు 231.90 కి.మీ.రోడ్లు దెబ్బ తిన్నాయని మరమ్మతులకి 1.39 కోట్ల రూపాయలతో అంచనా వేయటం జరిగిందని, గ్రామీణ రోడ్లు 7.10 కి మి దెబ్బతిన్నాయని వాటిని మరమ్మతులు చేయుటకు 4.26 లక్షల రూపాయలతో అంచనా వేయటం జరిగిందని,14 కల్వర్ట్లు,బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని,వాటిని మరమ్మత్తులు చేయుటకు 8.4 లక్షల రూపాయలతో అంచనాలు వేయటం జరిగిందన్నారు.
మున్సిపాల్టీలలో 19.58కి.మీ.రోడ్లు,12 కల్వర్ట్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని, వాటిని మరమ్మత్తులు చేయుటకు 6.32 కోట్ల రూపాయలతో అంచనా వేశారన్నారు.విద్యుత్ శాఖ ద్వారా 4461 కరెంట్ స్తంబాలకు గాను 2.23 కోట్లు,140 కి.మీ.కండక్టర్ తీగకు 70 లక్షలు,414 ట్రాన్సపార్మర్స్ మరమ్మత్తులు చేయుటకు 1.80 కోట్ల రూపాయలతో అంచనా వేయటం జరిగిందన్నారు.విద్యా శాఖ ద్వారా వరదలతో 4 ప్రాధమిక పాఠశాలలు,1 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,2 కెజిబివి పాఠశాలలు,1 ఎంఆర్ సి భవనం,1 సోషల్ వెల్పేర్ హాస్టల్,4 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేయుటకు 95.40 లక్షల రూపాయలతో అంచనా వేయటం జరిగిందన్నారు.
నీటిపారుదల శాఖ ద్వారా జిల్లాలో 40 మైనర్ ఇరిగేషన్ స్కీమ్ లు,13 మేజర్ ఇరిగేషన్ స్కీమ్ లు దెబ్బతిన్నాయని వాటికి మరమ్మత్తులు చేపట్టుటకు 24.30 కోట్ల రూపాయలతో అంచనా వేశారన్నారు.మిషన్ భగీరథ/త్రాగు నీరు సరఫరా పథకం కింద 16 ప్రదేశాలలో 2420 మీటర్ల పైప్ లైన్లు మరమ్మత్తు చేయుటకు 1.00 కోట్ల రూపాయలు,2 ప్రదేశాలలో 5 మోటార్లు మరమ్మత్తు చేయుటకు 14.5 లక్షల రూపాయలు అలాగే మున్సిపాల్టిలలో 1765 పైప్ లైన్లు దెబ్బ తిన్నాయని వాటిని మరమ్మత్తు చేయుటకు 26.27 లక్షల రూపాయలు అంచనా వేయటం జరిగిందని తెలిపారు.