మానవత్వం మరిచిన మానవ మృగాలు...!

సూర్యాపేట జిల్లా: సభ్య సమాజం సిగ్గుపడేలా మానవత్వం లేని ఇద్దరు మానవ మృగాలు ఓ మానసిక వికలాంగురాలిపై అత్యంత పాశవికంగా అఘాత్యానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లాల్ లక్ష్మీపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

 The Human Beasts Forgotten Humanity, Suryapet District, Nereducharla, Lal Lakshm-TeluguStop.com

సోమవారం లాల్ లక్ష్మిపురం గ్రామంలో మానసిక వికలాంగురాలైన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.

దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా ఎక్కడో ఓ చోట ఇలాంటి అమానుష ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయని, ఎందరో మహిళలు,చిన్న పిల్లలు,వృద్దులు కూడా కామాంధుల చేతుల్లో పడి నలిగిపోతున్నారని పలువురు మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు.ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి అందరికీ కనువిప్పు కలిగేలా అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube