సమస్యాత్మక గ్రామాలలో భారీ పికెట్ ఏర్పాటు: జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నేతృత్వంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు మరియు కేంద్ర బలగాలతో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ముందస్తు చర్యలలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ సిబ్బంది మరియు పారా మిలిటరీ సిబ్బంది పోలీసు కవాతు నిర్వహిస్తున్నామన్నారు.

 Massive Picket Formation In Troubled Villages Sp Rahul Hegde, Picket, Villages ,-TeluguStop.com

పౌరులు ఎన్నికల లోబడి నడుచుకోవాలని,ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడినా, గొడవలు సృష్టించినా

అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని, సమస్యాత్మక కేంద్రాలలో భారీ పికేటింగ్ ఏర్పాటు చేస్తామని,రాజకీయ నాయకులు గాని,పౌరులు గాని పరిమితికి మించి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు, సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ నాగభూషణం, డిసిఆర్బీ డిఎస్పీ రవి, ఎస్బి ఇన్స్పెక్టర్ రాజేష్,మహేష్, సీఐలు రాజశేఖర్,అశోక్ రెడ్డి,సర్కిల్ ఎస్ఐలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube