భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిస్తాం: ఎస్ఎఫ్ఐ

సూర్యాపేట జిల్లా: భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని సాక్షి శ్రీ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ 116వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.

 We Will Move In The Spirit Of Bhagat Singh Sfi, Bhagat Singh, Sfi, Suryapeta, B-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చిన భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడని,అత్యంత ధైర్యవంతుడని కీర్తించారు.భగత్ సింగ్ అనేక పుస్తకాలను అధ్యయనం చేశాడని,గొప్ప అధ్యయనశీలి అని కొనియాడారు.

భగత్ సింగ్ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని,భగత్ సింగ్ పాఠ్యాంశాలను కేజీ టు పీజీ వరకు పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని వారు డిమాండ్ చేశారు.భగత్ సింగ్ జీవిత చరిత్ర నేటి యువతకు విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు.

ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఎస్ఎఫ్ఐ ముందుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బానోత్ వినోద్ కుమార్, సాక్షి శ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్,ఎస్ఎఫ్ఐ నాయకులు తాళ్ల వినయ్, మనోహర్,వైభవ్ తేజ్, మౌనిక,మహేశ్వరి,రమ్య, స్వప్న,శిల్పా,సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube