సూర్యాపేట జిల్లా: భగీరదుడు పరోపకారానికి, దీక్షకు పెట్టింది పేరు అని” వైశాఖ శుద్ధ రోజు పురస్కరించుకొని భగీరదుని జయంతి కార్యక్రమమును నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్,ఎస్.మోహన్ రావు లతో కలసి వేడుకల్లో పాల్గొని భగీరథ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ భగీరథుడు మహా జ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరు,దీక్షకు,సహనానికి ప్రతిరూపమని,ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా అనుకున్నది నెరవేర్చడంలో ఆయనకి సాటిలేదన్నారు.చేసే పనుల్లో విజయం సాధించేవారిని భగీరధునితో పోలుస్తారని అలాగే భగీరధుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి అనసూర్య,సంఘ నాయకులు,టిఎన్జిఓ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.