దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట:మంత్రి

సూర్యాపేట జిల్లా:దివ్యాంగుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని,దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.శనివారం అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్బంగా మహిళ,శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జివివి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యాక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 Govt's Priority For The Welfare Of The Disabled: Minister-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి ఏమి కావాలని ఆలోచించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు.గతంలో రూ.750 ఉన్న వికలాంగుల పింక్షన్ ను తెలంగాణ ఏర్పడ్డాక రూ.3016 లకు పెంచిదని గుర్తు చేశారు.సకలాంగులతో సమానంగా వికలాంగులు అన్నిట్లో ముందుండాలని వారికి దివ్యాంగ ఉపకరణాలు,సబ్సిడీ రుణాలు,వివాహ పారితోషకాలు,మెరిట్ స్కాలర్షిప్లు అందజేసి వారి సంక్షేమం కొరకు నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో దివ్యాంగుల ఆశీర్వాదం ప్రభుత్వానికి ఉండాలని కోరారు.

జిల్లా కేంద్రంలో దివ్యాంగుల కొరకు అన్ని వసతులతో కూడిన భవనం త్వరలో కేటాయిస్తామని హామీ ఇచ్చారు.దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించి క్షేత్రస్థాయిలో దివ్యాంగుల సంక్షేమ పథకాలు చేరే విధంగా కృషి చేయడం జరిగిందని సకలాంగులకు దీటుగా దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలని, శారీరకంగా వైకల్యాన్ని అధిగమించి అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు.

అనంతరం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో రాణించిన సూర్యాపేట దివ్యాంగ క్రీడాకారులను సన్మానించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ట్రై సైకిల్ మరియు వీల్ చైర్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక,ఎలిమినేటి సందీప్ రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ శ్రీనివాస్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, సూర్యాపేట జడ్పిటిసి జీడి బిక్షం ఎంపీపీ రవీందర్ రెడ్డి,జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ,జిల్లా వైద్యాధికారి కోటాచలం,మెప్మా పీడీ రమేష్ నాయక్, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు నయుం, రాజేష్,జహీర్ బాబా,సతీష్,చిలక నాగేశ్వరావు,సైదులు,శ్రీనివాస్, రవీందర్,వార్డ్ కౌన్సిలర్ సుంకరి అరుణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube