మొబైల్ లైబ్రరీని ప్రారంభించిన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా:బోధన కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ మొబైల్ లైబ్రరీ వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 198 పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్న పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థను అభినందించారు.బుధవారం బోధన కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులలో సత్ఫలితాలు వస్తున్నాయని,తెలుగు,ఇంగ్లీష్,సైన్స్, గణితంలో ప్రత్యేక అభ్యసన,బిగ్గరగా చదివించడం ద్వారా వారిలో పఠనా శక్తిని పెంపొందించడం జరుగుతున్నదని తెలిపారు.

పీపుల్ ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ వైస్ చైర్మన్ జి.అరవింద్ కార్యాచరణను వివరించారు.198 హైస్కూల్స్ లో అన్ని రకాల మౌలిక వసతులు సమకూరుస్తున్నామని,మొబైల్ లైబ్రరీ ద్వారా ప్రతి పాఠశాలలో రెండు మూడు రోజులు ఉండి విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందించడం,మొబైల్ లైబ్రరీ ద్వారా అన్ని పాఠశాలలను కవర్ చేయడం జరుగుతుందని తెలిపారు.పీపుల్ ఫర్ ఇండియా ఫౌండర్ పబ్బతి సూరజ్,స్పాన్సర్లు పబ్బతి,రొంగాని హిమబిందు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా,శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి,జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆండాలు,మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
శంషాబాద్ ఎయిర్‎పోర్టు ఏరియాలో చిరుత .. పట్టుకునేందుకు అధికారుల తంటాలు

Latest Yadadri Bhuvanagiri News