సాధారణంగా ప్రభాస్( Prabhas ) సినిమాలకు బుల్లితెరపై అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.బాహుబలి, బాహుబలి2 సినిమాలతో పాటు డిజాస్టర్ గా నిలిచిన ఆదిపురుష్ సినిమా సైతం బుల్లితెరపై పెద్ద హిట్ గా నిలిచింది.
అయితే థియేటర్లలో హిట్ గా నిలిచిన సలార్ 1 ( Salaar 1 ) మాత్రం బుల్లితెరపై తీవ్రస్థాయిలో నిరాశ పరిచింది.పదిరోజుల క్రితం ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో( Star Maa ) ప్రసారం కాగా ఈ సినిమాకు కేవలం 6.5 రేటింగ్ వచ్చింది.
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ నుంచి ఇంత తక్కువ రేటింగ్ అస్సలు ఊహించలేమని నెటిజన్లు ఫీలవుతారు.ఈ రేటింగ్ విషయంలో తీవ్రస్థాయిలో నిరాశకు గురవుతున్నామని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు.700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించిన సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ ను అస్సలు ఊహించలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఓటీటీలో( OTT ) ఎక్కువమంది ఫ్యాన్స్ చూడటం వల్లే థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన రేంజ్ రెస్పాన్స్ రాలేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.సెకండ్ టెలీకాస్ట్ లో అయినా సలార్ మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సలార్ సినిమాను మరీ ఆలస్యంగా బుల్లితెరపై ప్రసారం చేశారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
సలార్ 2( Salaar ) సినిమా ఈ ఏడాదే మొదలవుతుందని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమా ఆలస్యమవుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.సలార్ మేకర్స్ మాత్రం వైరల్ అవుతున్న వార్తల విషయంలో సైలెంట్ గా ఉంటున్నారు.ప్రభాస్ సైతం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.త్వరలో ఈ సినిమాకు అంబంధించి ఏవైనా అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.సలార్2 సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.400 కోట్ల రూపాయల రేంజ్ లో సలార్2 కోసం ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది
.