ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి తమ పార్టీదే అధికారమని సీఎం జగన్( CM Jagan ) పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.జగన్ ఇంత నమ్మకంగా ఉండటానికి ఒక విధంగా సీమ జిల్లాలు కారణమైతే మరో విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలు( Uttarandhra Districts ) కారణం కావడం గమనార్హం.
దశాబ్దాలు గడిచినా ఏపీలో అభివృద్ధికి నోచుకోని జిల్లాలలో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందువరసలో ఉంటాయి.ఉమ్మడి వైజాగ్ మినహా మిగతా జిల్లాలలో అక్షరాస్యత శాతం కూడా తక్కువ అనే సంగతి తెలిసిందే.
వైసీపీ( YCP ) పాలనలో వైజాగ్ ను ( Vizag ) రాజధానిగా ప్రకటించడం వల్ల ఇక్కడి ప్రజలకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలిగింది.అదే సమయంలో ఉత్తరాంధ్ర ప్రజలకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతాయి.
సీమతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీ ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఉత్తరాంధ్రలో ప్రస్తుతం సైలెంట్ వేవ్ ఉందని సమాచారం అందుతోంది.ఉత్తరాంధ్రలో మొత్తం 34 నియోజకవర్గాలు ఉండగా కనీసం 25 స్థానాల్లో సత్తా చాటుతామని వైసీపీ భావిస్తుండటం గమనార్హం.వైసీపీ ఈ ఎన్నికల్లో సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తే మాత్రం తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాంధ్ర అభివృద్ధి( Uttarandhra Development ) కోసం వైసీపీ కీలక నిర్ణయాలను తీసుకుంది.
మహిళలు, బీసీలు, రెడ్ల ఓట్లు తమకే ఉంటాయని వైసీపీ భావిస్తోంది.ఈ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అంచనాలు నిజం అవుతాయో లేదో తెలియాల్సి ఉంది.ఇతర జిల్లాలలో సైతం సగానికి పైగా స్థానాలలో వైసీపీదే విజయమని సర్వేలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో మరో నెల రోజుల్లో తేలిపోనుంది.ఉత్తరాంధ్రలో గెలుపు కోసం వైసీపీ నేతలు సైతం తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు.
వాళ్ల కష్టానికి తగిన ఫలితం ఈ ఎన్నికల్లో దక్కుతుందో లేదో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.