తెలంగాణలో కాంగ్రెస్ ను( Congress ) ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్( Etala Rajender ) అన్నారు.ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు.
పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది బీజేపీ( BJP ) సంకల్పమని ఈటల రాజేందర్ తెలిపారు.బీసీ కమిషన్ కు ( BC Commission ) చట్టబద్ధత కల్పించింది బీజేపీ అని ఆయన పేర్కొన్నారు.
అగ్రకులాల్లో పేదలకు మోదీ రిజర్వేషన్లు కల్పించారన్నారు.రాజ్యాంగానికి ఇప్పటివరకు 106 సార్లు మార్పులు జరిగాయన్న ఈటల రాజేందర్ రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు.
రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదని వెల్లడించారు.







