అధిక బరువు చిన్నా, పెద్దా, ఆడా, మగా అనే తేడా లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది.నేటి కాలంలో ఎందరికో ఈ అధిక బరువు సమస్య పెద్ద భారంగా మారింది.
దీంతో బరువు తగ్గేందుకు నోరును కట్టుకోవడంతో పాటు కఠిన వ్యాయామాలు చేస్తూ నానా పాట్లు పడుతుంటారు.అయితే వాస్తవానికి కొన్ని కొన్ని ఆహారాలు బరువు తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
అలాంటి వాటిలో అంజీర పండు ఒకటి.దీనినే అత్తి పండు అని పిలుస్తుంటారు.
అంజీర పండులో కాలిష్యం, ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటిఆసిడ్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి.అటువంటి అంజీర పండును అధిక బరువు ఉన్న వారు డైట్‌లో చేర్చుకుంటే ఇందులో ఉండే పీచు పదార్థం వెయిట్ లాస్ అయ్యేందుకు సహాయపడుతుంది.
పైగా అంజీర పండ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా చేరదు.కాబట్టి, రోజుకు రెండు అంజీర పండ్లను భోజనానికి గంట ముందు తీసుకుంటే త్వరగా బరువు తగ్గొచ్చు.
ఇక అంజీర పండుతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.అంజీర పండ్లలో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువగా ఉంటుంది.అందువల్ల, రక్తపోటు సమస్య ఉన్న వారు అంజీర పండ్లను తీసుకుంట బీపీ ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంటుంది.అంజీర పండ్లను తీసుకోవడం వల్ల రక్తహీనత, మలబద్ధకం, సంతానలేమి వంటి సమస్యలు దూరం అవుతాయి.
అలాగే సౌందర్య పరంగా కూడా అంజీర పండు ఉపయోగపడుతుంది.మొటిమలు సమస్య ఉన్న వారు అంజీర పండును మెత్తగా పేస్ట్ చేస అందులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి ముఖానికి అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల తర్వాత కోల్డ్ వాటర్‌తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.