ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప పుష్ప సాంగ్( Pushpa Pushpa Song ) మారుమోగిపోతుంది.ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే కాకుండా భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకొని దూసుకుపోతుంది ఇక ఈ పాట ఏకంగా 15 దేశాలలో ట్రెండ్ అవుతుంది.
అంటే ఈ పాటకు ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది.ఇకపోతే అల్లు అర్జున్( Allu Arjun ) ఈ పాటకు సంబంధించిన కొంత ట్రాక్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇక ఈ వీడియోని షేర్ చేసిన ఈయన పుష్ప పుష్ప పాటలో ఈ షూ డ్రాప్ స్టెప్ చేయడాన్ని ఎంతో ఆనందించాను అంటూ పోస్ట్ చేసారు.
ఇలాంటి పోస్ట్ చేయడమే కాకుండా దీనికి #Pushpa2TheRule, #Pushpa2FirstSingle అనే హ్యాష్‌ట్యాగ్‌లను తన పోస్టుకు జత చేశాడు.ఇలా ఈయన ఈ పోస్ట్ చేయడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు బన్నీ అభిమానులు ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఆయనపై ప్రశంసల కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner ) సైతం అల్లు అర్జున్ వీడియో పై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.
ఓ డియర్ ఇది చాలా బాగుంది.ఇప్పుడు నాకు కొంత పని పడింది అంటూ బన్నీని ట్యాగ్ చేశాడు.ఇది చూసిన అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ.
ఇది చాలా సులభం.మనం కలిసినప్పుడు నేను మీకు చూపిస్తాను అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు అయితే వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో త్వరలోనే డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ చేసిన ఈ స్టెప్పులను రీ క్రియేట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
మొత్తానికి ఈ పాట సోషల్ మీడియాలో మారుమోగుతుంది.