ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో నటించినటువంటి చిత్రం పుష్ప( Pushpa ).ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2( Pushpa 2 ) సినిమా ఆగస్టు 15వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుని ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది.
ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో అప్డేట్లను తెలియజేస్తూ వచ్చారు.అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇందులో అల్లు అర్జున్ షూ డ్రాప్ స్టెప్స్ అలాగే టి గ్లాస్( Tea Glass ) చేతిలో పట్టుకొని ఆ టీ గ్లాస్ పడిపోకుండా స్టెప్స్ వేయడం అందరిని ఆకట్టుకుంది.
అల్లు అర్జున్ స్టెప్పులకు దేవిశ్రీప్రసాద్ సంగీతానికి ప్రేక్షకులు మరోసారి కనెక్ట్ అయ్యారు.ఇక ఈ పాటకు ఎంతోమంది డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.అంతేకాకుండా ఈ పాటలో అల్లు అర్జున్ చేసినటువంటి స్టెప్పులకు ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే నటి అనసూయ( Anasuya ) కూడా ఈ స్టెప్పులపై స్పందించారు.ఈమె కూడా ఈ సినిమాలో దాక్షాయని అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక అల్లు అర్జున్ ఈ పాటకు సంబంధించిన స్టెప్పులను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నీ పేరే నీ బ్రాండ్ అంటూ ఈమె పై ప్రశంసల వర్షం కురిపించడమేకాకుండా ఆ టీ గ్లాస్ తో డాన్స్ చేయడం చాలా కష్టం అంటూ చెప్పుకు వచ్చారు.ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.