వైరల్ వీడియో: సఫారీ జీపుపై దాడికి పాల్పడిన ఏనుగు.. చివరకు..

ప్రపంచవ్యాప్తంగా జంతువులకు సంబంధించి ఎన్నో జూలు, అలాగే వాటిని ప్రశాంతంగా జీవించేందుకు ఏర్పాటు చేసిన రిజర్వ్ ఫారెస్టులు( Reserve Forests ) ఉన్నాయి.ఇక రిజర్వ్ ఫారెస్ట్ లో జంతువులను చూడడానికి వెళ్ళినప్పుడు జరిగే అనేక వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటాయి.

 The Elephant That Attacked The Safari Jeep Viral Video Details, Social Media, Vi-TeluguStop.com

తాజాగా అలాంటి వీడియో మరొకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే( IFS Ramesh Pandey ) తన సోషల్ మీడియా ఖాతా నుండి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియో సంబంధించిన విషయం చూస్తే.

వీడియోలో కనిపించిన వీడియో ప్రకారం కొందరు పర్యాటకులు జీపుల్లో వన్యప్రాణులు సందర్శించేందుకు ఓ రిజర్వ్ ఫారెస్ట్ కు వెళ్తారు.అయితే అక్కడ అనుకోకుండా ఏనుగుతో( Elephant ) సంఘటన చోటు చేసుకుంటుంది.ఫారెస్ట్ లో సఫారీ జీపులను చూసి ఓ మగ ఏనుగుకు ఎందుకో కోపం వచ్చింది.

దాంతో ఆ ఏనుగు ఓ సఫారీ జీపు పై దాడికి సిద్ధమైంది.అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఉన్న ఓ జీపు పైకి ఏనుగు దూసుకొచ్చింది.ప్రయాణికులు జీపులో ఉండగానే జీపు మొత్తాన్ని దొర్లించాలని తెగ ప్రయత్నం చేసింది.అయితే ఈ సమయంలోనే పక్కనే ఉన్న కొంతమంది వివిధ జీపులోని ప్రయాణికులు అలాగే రిజర్వ్ ఫారెస్ట్ సిబ్బంది అందరూ గట్టిగా అరిస్తే ఏనుగు తన ప్రయత్నాన్ని విరమించుకుంది.

అయితే ఈ విషయం ఎక్కడ జరిగిందన్న విషయాలు మాత్రం పూర్తిగా తెలియ రాలేదు.రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సఫారీ పర్యటనలో( Safari Tour ) ఇలా తరచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి.వన్య ప్రాణుల పర్యటనలో నేపథ్యంలో నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ఏర్పర్చిన మార్గదర్శకాలను యాత్రికులు పాటించాలని ఇందుకు సంబంధించిన వీడియో క్యాప్షన్లో కూడా తెలిపారు.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం భయభ్రాంతులకు లోనవుతున్నారు.

ఇందులో భాగంగా కొందరు నెటిజెన్స్ చూసే వారికె ఇంత భయంకరంగా అనిపిస్తే.ఆ సంఘటన ఎదుర్కొన్న వారి పరిస్థితి ఏంటో ఆలోచించండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube