హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టే మామిడి ఆకులు..ఎలాగంటే?

హెయిర్ ఫాల్ తీవ్రంగా వేధిస్తుందా.? ఎన్ని షాంపూలు, నూనెలు మార్చినా జుట్టు రాల‌డం త‌గ్గ‌డం లేదా.? అయితే మీరు మామిడి ఆకుల‌ను వాడాల్సిందే.అవును, మామిడి ఆకుల్లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌క విలువ‌లు హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్ట‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

 Mango Leaves Help To Stop Hair Fall! Mango Leaves, Stop Hair Fall, Hair Fall, Ha-TeluguStop.com

మ‌రి కేశాల‌కు మామిడి ఆకుల‌ను ఎలా యూజ్ చేయాలో ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ముందుగా ప‌ది వ‌ర‌కు మామిడి ఆకుల‌ను తీసుకుని నీటిలో శుభ్రం చేసుకోవాలి.

ఆపై మామిడి ఆకుల‌ను క‌చ్చ ప‌చ్చ‌గా నూరుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు స్ట‌వ్‌పై ఒక మంద‌పాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక క‌ప్పు ఆవ నూనె మ‌రియు క‌చ్చ ప‌చ్చ‌గా నూరుకున్న మామిడి ఆకులు వేసి హీట్ చేయాలి.

స్లో ఫ్లేమ్‌పై ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు బాగా వేడి చేసుకుని.ఆ త‌ర్వాత చ‌ల్లార‌నిచ్చి నూనెను ఫిల్ట‌ర్ చేస్తే అద్భుత‌మైన హెయిర్ ఆయిల్ సిద్ధ‌మైన‌ట్టే.

Telugu Benefits Mango, Care, Care Tips, Fall, Latest, Long, Mango-Telugu Health

ఈ ఆయిల్‌ను త‌ల‌కు ప‌ట్టించి బాగా మ‌సాజ్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజూ చేస్తే గ‌నుక‌.జుట్టు కుదుళ్ల‌కు బ‌లం చేకూరి ఊడ‌టం త‌గ్గు ముఖం ప‌డుతుంది.మ‌రియు మామిడి ఆకుల‌తో చేసిన ఈ ఆయిల్‌ను యూజ్ చేయ‌డం వ‌ల్ల జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.

అలాగే కొన్ని మామిడి ఆకుల‌ను తీసుకుని నీడ‌లో ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు బౌల్‌లో రెండు స్పూన్ల మామిడి ఆకుల పొడి, ఒక స్పూన్ శీకాయ పొడి, ఒక స్పూన్ పెరుగు, మూడు స్పూన్ల కొబ్బ‌రి నూనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొత్తానికి ప‌ట్టించి గంట పాటు ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.ఆపై కెమిక‌ల్స్ లేని షాంపూతో త‌ల స్నానం చేయాలి.

ఇలా వారంలో ఒక సారి చేస్తే హెయిర్ ఫాల్ త‌గ్గి జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది.అదే స‌మ‌యంలో చుండ్రు స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube