పాలస్తీనా అనుకూల నిరసనలు : కొలంబియా వర్సిటీలో పోలీస్ అధికారి కాల్పులు .. వివాదం

ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం అగ్రరాజ్యం అమెరికాకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.ఇజ్రాయెల్‌కు( Israel ) మద్ధతుగా కొందరు, పాలస్తీనాకు( Palestine ) మద్ధతుగా మరికొందరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

 Nypd Police Officer Fired Gun While Clearing Protesters From Columbia Building D-TeluguStop.com

ఇవి కొన్నిచోట్ల హింసాత్మంగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.యేల్, కొలంబియా, న్యూయార్క్ యూనివర్సిటీలు సహా అనేక విశ్వవిద్యాలయాలలో ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి.

ఈ నిరసనల్లో అనేక దేశాలకు చెందిన విద్యార్ధులు , యువత పాల్గొంటున్నారు.దీంతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ఇటీవల అమెరికాలో( America ) పలు క్యాంపస్‌లలో పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొన్న దాదాపు 2500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.టెంట్ క్యాంప్‌లు, ఆక్రమిత భవనాలను క్లియర్ చేయడానికి పోలీసులు టాక్టికల్ వెహికల్స్, ఫ్లాష్ బ్యాంగ్ పరికరాలను ఉపయోగించాల్సి వస్తోంది.

గత వారం కొలంబియా యూనివర్సిటీ( Columbia University ) అడ్మినిస్ట్రేషన్ భవనం లోపల క్యాంప్ చేసిన నిరసనకారులను క్లియర్ చేసే క్రమంలో ఓ అధికారి అనుకోకుండా తుపాకీతో కాల్పులు జరపడం వివాదాస్పదమైంది.

Telugu America, Columbia, Fired Gun, Hamilton Hall, Israel, Israelpalestine, Yor

కొలంబియా క్యాంపస్‌లోని హామిల్టన్ హాల్‌లో( Hamilton Hall ) మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్( Newyork Police Department ) గురువారం ప్రకటించింది.ఆ సమయంలో తన తుపాకీకి అమర్చిన ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తుండగా.పొరపాటున ఫైరింగ్ జరిగిందని వెల్లడించింది.

సమీపంలో విద్యార్ధులెవరూ లేరని, ఇతర అధికారులే వున్నారని తెలిపింది.సదరు అధికారి బాడీ క్యామ్‌ ఫుటేజ్‌ను విశ్లేషించడంతో పాటు డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఈ ఘటనపై సమీక్ష నిర్వహిస్తోంది.

Telugu America, Columbia, Fired Gun, Hamilton Hall, Israel, Israelpalestine, Yor

కొలంబియా యూనివర్సిటీలో నిరసనల సమయంలో దాదాపు 100 మందికి పైగా విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు.అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 18 నుంచి నేటి వరకు 43 యూఎస్ కళాశాలు, వర్సిటీలలో కనీసం 56 అరెస్ట్‌లు చోటు చేసుకున్నాయి.కాగా .ఇజ్రాయెల్ వ్యతిరేక అల్లర్లను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సీరియస్‌గా పరిగణించింది.రెండు క్యాంపస్‌లపై దాడి చేసి 300 మంది నిరసనకారులను అరెస్ట్ చేసింది.కొలంబియా వర్సిటీ నుంచి నోటీసు అందుకున్న తర్వాతే పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించినట్లుగా మీడియా నివేదించింది.

విద్యార్ధులను క్యాంపస్ వెలుపలికి పంపించి.బస్సుల్లో ఎక్కించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube