సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయినిగూడెంలో జరిగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి శనివారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ వర్ధంతి సభకు ముఖ్యాతిథులుగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు,రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి,నల్గొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారాన్నరు.
ఈ వర్ధంతి సభకు పార్టీ జిల్లా,మండల నాయకులు,కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.