ఆర్టీజన్ లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి:ముస్త్యాల కిషన్

సూర్యాపేట జిల్లా:విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ ఎస్పీడీసీఎల్ గౌరవాధ్యక్షులు ముస్త్యాల కిషన్ అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం నుంచి తెలంగాణ బహుజన విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్.

ప్రవీణ్ కుమార్ కి వినతిపత్రం ఇవ్వడం కోసం బయలుదేరుతూ మాట్లాడారు.విద్యుత్ సంస్థలో 23000 వేల మంది ఆర్టిజన్ లు ఉన్నారని,వారిని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనులు మాత్రం చేయించుకుంటూ వేతనం విషయంలో తక్కువచేసి చూస్తున్నారని ఆరోపించారు.

వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, సమానం వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇటీవల కాలంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుందని,అనేక మంది ఆర్టిజన్లు పనిచేస్తున్న సంస్థలో గాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకనైనా ప్రభుత్వం ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పరిదల ప్రసాద్,నరేందర్,వాల్ సింగ్,సతీష్,రవి, మధుసూదన్,అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

Latest Suryapet News