సూర్యాపేట జిల్లా:ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సిబ్బంది జాగ్రత్తగా ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.మంగళవారం హుజూర్ నగర్ మున్సిపాల్టీ కార్యాలయంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే వివరాల ఆన్లైన్ నమోదు గురించి వివరాలను కలెక్టర్ ఆపరేటర్ ని అడిగి తెలుసుకొని పలు సలహాలు,సూచనలు చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఫ్యామిలీ డిజిటల్ సర్వే పైలెట్ ప్రాజెక్టు కింద 5 బృందాలతో హుజూర్ నగర్ మున్సిపాల్టీ లో 4 వ వార్డ్ లోని 381 గృహలలో సర్వే నిర్వహించడం జరిగిందని,వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తున్నామని తెలిపారు.తదుపరి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ లో మున్సిపాల్టిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాల్టీ లో ఏమైనా త్రాగు నీరు సమస్య ఉంటే మిషన్ భగీరధ అధికారులకు తెలియపర్చి ఎక్కువ నీరు సరఫరా చేసుకోవాలని సూచించారు.అన్ని వార్డ్ లలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండ నిరంతరం శానిటేషన్,పాగింగ్ చేయాలన్నారు.
యల్ ఆర్ ఎస్ దరఖాస్తులను అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రతి దరఖాస్తు క్షేత్ర స్థాయి కి వెళ్ళి పరిశీలించాలని తెలిపారు.మున్సిపాల్టీలో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ కి కావలసిన స్థలముని గుర్తించి మున్సిపల్ అధికారులకు అందించాలని ఆర్డిఓకి సూచించారు.
మున్సిపాల్టీలో పన్నులు వసూలు చేయటంలో చాలా వెనకంజలో ఉన్నారని వేగవంతంగా పన్ను వసూలు చేయాలని,చెత్త తరలించే స్వచ్ఛ ఆటోలు ఓనర్ కం డ్రైవర్ పథకమును అమలు పర్చాలని అధికారులకు సూచించారు.అనంతరం హుజూర్ నగర్ రామస్వామి గుట్ట వద్ద ఆదర్శకాలనీ గృహాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అవసరం అయితే ఎక్కువ మంది కూలీలను ఏర్పాటు చేసుకొని అక్టోబర్ చివరి నాటికి స్లాబ్ పోయని గృహలకు స్లాబ్ పోయాలని సూచించారు.ప్రస్తుతం 800మంది కూలీలు,28 సెట్ల స్లాబ్ మెటీరియల్స్ తో పని చేస్తున్నారని అక్టోబర్ చివరి నాటికి అన్ని గృహలకు స్లాబ్ లు పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్ కి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ శ్రీనివాసులు,డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ యాకుబ్ పాషా,ఎఈ వినోద్ కుమార్ ,శానిటరి ఇన్స్ పెక్టర్ ఆశోక్, రెవిన్యూ అధికారి సాయి రెడ్డి,హౌజింగ్ డిఈ జబ్బార్ అహ్మద్,ఎఈ వెంకన్న,కాంట్రాక్టర్ రవీందర్ రావు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.