సూర్యాపేట జిల్లా:కోదాడమున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ గ్రామానికి చెందిన హమాలీ కూలీ వెంకన్న( Venkanna ) ఐదేళ్ల కుమార్తె కాలేయ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది.వ్యాధి బారిన పడిన చిన్నారికి ఐదేళ్ల వయసున్నా ఎదుగుదల లేక ఇంకా ఏడాది చిన్నారిలా ఉంది.
తల్లిదండ్రులు వ్యాధిని తొందరగా గమనించక పోవడంతో ఇటీవల పొట్ట ఉబ్బడం,ఆయాస పడటంతో హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.వైద్యులు పరీక్షించి కాలేయ వ్యాధితో చిన్నారి బాధపడుతుందని వైద్య ఖర్చులకు 30 లక్షలు ఖర్చు అవుతుందని,అంత స్తోమత లేక రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబం దాతల సహాయం కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.
దాతలు ఎవరైనా 9951676183 నంబర్ కు ఫోన్ పే గాని గూగుల్ పే గాని చేసి తమ బిడ్డను కాపాడాలని వేడుకుంటున్నారు.