Women Selling Liquor : గంపలో పెట్టుకొని మద్యం అమ్ముతున్న మహిళలు

హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోనిపాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా( John Pahad Dargah )కు సమీపంలోని దక్కన్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు పక్కన మహిళలుగంపలో మద్యం బాటిళ్లు పెట్టుకొని అమ్ముతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.సంతలో సరుకులు అమ్మినట్లు క్వార్టర్ బాటిల్స్( Quarter Bottles ) అమ్మకాలు జరిపేందుకు పర్మిట్ వైన్స్( Permit Wines ) వాళ్ళే సంవత్సరానికి బాండ్ రాసి ఇస్తున్నట్లు సదరు మహిళకు చెబుతున్నట్లు సమాచారం.

 Women Selling Liquor In Basket-TeluguStop.com

మరి ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు తెలియదా లేక అందరికీ తెలిసే జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఇంతకీ ఈ మద్యం ఒరిజినలా…?నకిలీదా…? అనేది మాత్రం సస్పెన్షన్.ప్రస్తుతం మహిళలు మద్యం అమ్ముతున్న వీడియోలు( Women Selling Liquor Videos ) సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ప్రభుత్వంపై పలు రకాల విమర్శలు చేస్తున్నారు.మాటల్లో కాదు చేతల్లో చూపించి ఆదర్శంగా నిలవాలని సూచనలు చేస్తున్నారు.

సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు వెంట మద్యం అమ్మకాలు అరికట్టాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube