వింటర్ సీజన్ లో క‌చ్చితంగా తీసుకోవాల్సిన 5 రకాల డ్రై ఫ్రూట్స్ ఇవే!

వింటర్ సీజన్ రానే వచ్చింది.ఈ సీజన్ లో స‌హ‌జంగానే ఇమ్యూనిటీ సిస్టమ్‌ వీక్ అయిపోతుంటుంది.

 These Are The 5 Types Of Dry Fruits That Must Be Taken In The Winter Season ,-TeluguStop.com

ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.అలాగే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అయితే వీటికి దూరంగా ఉండాలంటే పోషకాహారాన్ని తీసుకోవాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ను కచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి.

మరి ఆ ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ( Dry fruits )ఏంటి.వాటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Almonds, Anjeer, Apricots, Dates, Dry Fruits, Tips, Latest, Raisins, Seas

ఎండిన అత్తిపండ్లు.( Figs Side ) వీటినే అంజీర్ అని పిలుస్తారు.శీతాకాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన డ్రై ఫ్రూట్ ది.రోజుకు రెండు నానబెట్టిన అత్తిపండ్లను తింటే బరువు అదుపులో ఉంటుంది.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.రక్తంలో చక్కెర స్థాయిలు సైతం నియంత్రణలో ఉంటాయి.అలాగే చలికాలంలో డ్రై ఆప్రికాట్స్ ను డైట్ లో ఉండేలా చూసుకోవాలి.వీటిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలపరచడానికి గ్రేట్ గా సహాయపడతాయి.

వీటిని రెగ్యులర్ గా తింటే అనేక శక్తి వనరులు పొందుతారు.అదే సమయంలో చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.

కిస్ మిస్ ( Kismiss )ను కూడా ప్రస్తుత ఈ వింటర్ సీసన్ లో రోజు తినేందుకు ప్రయత్నించండి.ఐదు నుంచి ప‌ది కిస్ మిస్ లను నైట్ అంతా వాటర్ లో నానబెట్టి ఉదయం తీసుకోండి.

ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.స్క్రీన్ గ్లోయింగ్ గా హైడ్రేటెడ్ గా ఉంటుంది.

Telugu Almonds, Anjeer, Apricots, Dates, Dry Fruits, Tips, Latest, Raisins, Seas

ఎండు ఖర్జూరం( Dates ) చలికాలంలో మన ఆరోగ్యానికి మేలు చేసే మరొక అద్భుతమైన డ్రై ఫ్రూట్‌. ( Dry fruits )రోజుకు రెండు ఎండు ఖర్జూరాలను తింటే రక్తహీనత దూరం అవుతుంది.ఎండు ఖ‌ర్జూరాలు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి.జర్ణక్రియను సైతం ప్రోత్సహిస్తాయి.ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాదం.బాదం అత్యంత ప్రసిద్ధ డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి.

గుండె ఆరోగ్యానికి బాదం ఎంతో మేలు చేస్తుంది.చలికాలంలో చాలా మంది గుండెపోటుకు గురవుతుంటారు.

అయితే ఆ రిస్క్ ను తగ్గించడానికి బాదం సహాయపడుతుంది.అలాగే వెయిట్ లాస్ కు సైతం తోడ్పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube