వింటర్ సీజన్ లో క‌చ్చితంగా తీసుకోవాల్సిన 5 రకాల డ్రై ఫ్రూట్స్ ఇవే!

వింటర్ సీజన్ రానే వచ్చింది.ఈ సీజన్ లో స‌హ‌జంగానే ఇమ్యూనిటీ సిస్టమ్‌ వీక్ అయిపోతుంటుంది.

ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.అలాగే చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అయితే వీటికి దూరంగా ఉండాలంటే పోషకాహారాన్ని తీసుకోవాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ను కచ్చితంగా డైట్ లో చేర్చుకోవాలి.

మరి ఆ ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ ( Dry Fruits )ఏంటి.

వాటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ఎండిన అత్తిపండ్లు.

( Figs Side ) వీటినే అంజీర్ అని పిలుస్తారు.శీతాకాలంలో కచ్చితంగా తీసుకోవాల్సిన డ్రై ఫ్రూట్ ది.

రోజుకు రెండు నానబెట్టిన అత్తిపండ్లను తింటే బరువు అదుపులో ఉంటుంది.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు సైతం నియంత్రణలో ఉంటాయి.అలాగే చలికాలంలో డ్రై ఆప్రికాట్స్ ను డైట్ లో ఉండేలా చూసుకోవాలి.

వీటిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలపరచడానికి గ్రేట్ గా సహాయపడతాయి.

వీటిని రెగ్యులర్ గా తింటే అనేక శక్తి వనరులు పొందుతారు.అదే సమయంలో చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.

కిస్ మిస్ ( Kismiss )ను కూడా ప్రస్తుత ఈ వింటర్ సీసన్ లో రోజు తినేందుకు ప్రయత్నించండి.

ఐదు నుంచి ప‌ది కిస్ మిస్ లను నైట్ అంతా వాటర్ లో నానబెట్టి ఉదయం తీసుకోండి.

ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.స్క్రీన్ గ్లోయింగ్ గా హైడ్రేటెడ్ గా ఉంటుంది.

"""/" / ఎండు ఖర్జూరం( Dates ) చలికాలంలో మన ఆరోగ్యానికి మేలు చేసే మరొక అద్భుతమైన డ్రై ఫ్రూట్‌.

( Dry Fruits )రోజుకు రెండు ఎండు ఖర్జూరాలను తింటే రక్తహీనత దూరం అవుతుంది.

ఎండు ఖ‌ర్జూరాలు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి.జర్ణక్రియను సైతం ప్రోత్సహిస్తాయి.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాదం.బాదం అత్యంత ప్రసిద్ధ డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి.

గుండె ఆరోగ్యానికి బాదం ఎంతో మేలు చేస్తుంది.చలికాలంలో చాలా మంది గుండెపోటుకు గురవుతుంటారు.

అయితే ఆ రిస్క్ ను తగ్గించడానికి బాదం సహాయపడుతుంది.అలాగే వెయిట్ లాస్ కు సైతం తోడ్పడతాయి.

భారతదేశంపై చైనీయుడు ఊహించని కామెంట్స్.. “ఇదో మిస్టరీ ప్లేస్” అంటూ..