పచ్చళ్లు మన భారతీయులు ఎంత పరమప్రీతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా తెలుగు వారు రోజూ భోజనంలో పచ్చడి లేనిదే తినలేరు.
ఎన్ని కూరలున్నా సరే రెండు ముద్దలైన నోరూరించే పచ్చడితో లాగించాల్సిందే.అయితే ఇటీవల కాలంలో చాలా మంది పచ్చళ్లకు దూరంగా ఉంటున్నాయి.
పచ్చళ్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదని భావిస్తుండటమే ఇందుకు కారణం.కానీ, నిజానికి పచ్చళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అతిగా తీసుకుంటే మినహా పచ్చళ్లు ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు.
ఇక పచ్చళ్లలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందీ అంటే నిమ్మకాయ పచ్చడి అనడంలో సందేహమే లేదు.
నిమ్మకాయ పచ్చడిని తరచూ తగిన మోతాదులో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు.ముఖ్యంగా నిమ్మ కాయ పచ్చడి తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
దాంతో సీజనల్‌గా వచ్చే జబ్బులకు, వైరస్‌లకు దూరంగా ఉండొవచ్చు.అలాగే ఏవైనా గాయాలు అయిన వారు నిమ్మ కాయ పచ్చడి తీసుకుంటే.
అందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి గాయాలను త్వరగా తగ్గేలా చేస్తుంది.

నిమ్మ కాయ పచ్చడి తీసుకోవడం వల్ల ఇనుము, కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా శరీరానికి అందుతాయి.దాంతో ఎముకలు, దంతాలు బలంగా మారతాయి.హై బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్ ఈ రెండూ ఆరోగ్యానికి చాలా ప్రమాదం.
అయితే నిమ్మ కాయ పచ్చడి తీసుకుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి రక్త పోటు అదుపులో ఉంటుంది.

ఇక నిమ్మ కాయ పచ్చడిలో ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు.కాబట్టి, దీన్ని తీసుకున్నా బరువు పెరుగుతారనే భయం ఉండదు.పైగా నిమ్మ కాయ పచ్చడి తీసుకుంటే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు.
అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా మాత్రం తీసుకోరాదు.నిమ్మ కాయ పచ్చడి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ మోతాదుకి మించి తీసుకుంటే అనేక సమస్యలు వచ్చేలా చేస్తుంది.