ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి:మంత్రి

సూర్యాపేట జిల్లా:జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి.

 Focus On Alternative Crops: Minister-TeluguStop.com

వినయ్ కృష్ణా రెడ్డితో కలసి ప్రత్యామ్నాయ పంట సాగు విధానంపై సమీక్షించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంట సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆదిశగా అధికారులు నిరంతరం ప్రత్యేక కృషిచేయాలని సూచించారు.

జిల్లాలో పెరుగిన నీటి వనరులు ఆధారంగా ఈ వనాకాలంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఇప్పటికే జిల్లాలో 561 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటలు రైతులు సాగు చేస్తున్నారని రాబోవు సంవత్సరాలలో రైతులు మరింత ఉద్యాన సాగు చేసేలా కృషి చేయాలని అన్నారు.

ముఖ్యoగా పంటల సాగు విధానంపై అన్ని క్లస్టర్లలో ఉన్న రైతు వేదికల ద్వారా వ్యవసాయ,ఉద్యాన అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.జిల్లాలో వేరుశెనగ,కందులు,బననా,నిమ్మజాతి అలాగే టిష్యు కల్చర్ సాగును ఎక్కువగా పెంచాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని పంట సాగుకు ఉత్సాహం చూపే రైతులను మహారాష్ట్ర లోని జలగావ్ సందర్శన టూర్ తీసుకొని వెళ్లాలని ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ తో కలసి పంటసాగుపై క్లస్టర్ వారీగా సమీక్షించారు.

ఈ సమావేశంలో డి.ఏ.ఓ రామారావు నాయక్,డి.హెచ్.

యస్.శ్రీధర్ గౌడ్,డి.యం.ఓ సంతోష్,ఏ.డి.ఎ,ఏ.ఓలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube