అథ్లెటిక్స్ విభాగంలో మెరిసిన భానుపురి బిడ్డ

సూర్యాపేట జిల్లా:అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయిలో 400 మీటర్ల పరుగు పందెం విభాగంలో ఆకారపు యువరాజ్ మెరిశారు.సూర్యాపేట జిల్లా తరపునుండి ప్రాతినిధ్యం వహించిన ఆకారపు యువరాజ్ తండ్రి భాస్కర్ తుంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు.

 Shining Bhanupuri Child In The Athletics Department-TeluguStop.com

ప్రధానోపాధ్యాయులు,పీడీ యాకయ్య,పాఠశాల సిబ్బంది యువరాజును ప్రశంసించారు.రాబోయే రోజుల్లో తెలంగాణకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల పీడీ కొండగడుపుల యాకయ్యని సన్మానించారు.ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు, సావిత్రిబాయి పూలేల దంపతుల చిత్రపటాన్ని మరియు హైటెక్ విజయ రహస్యం పుస్తకాలను ఆకారపు యువరాజ్ పాఠశాల లైబ్రరీకి బహుమతిగా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రావులపల్లి ప్రధానోపాధ్యాయులు జి.వెంకట్ రెడ్డి,కోట సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube