నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతురు అక్కడిక్కడే మృతి చెందిన విషాద సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆదిలక్ష్మి (38),ప్రశాంతి (18) అనే తల్లీ కూతుర్లు స్కూటీపై హైదరాబాద్ నుండి చిలకలూరిపేట వెళ్తుండగా దామరచర్ల మండలం కొండ్రపోలు వద్దకు రాగానే లారీ అదుపుతప్పి బైకును ఢీకొనడంతో తల్లి,కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.