నల్లగొండ జిల్లా: నల్లగొండ రూరల్ మండలం కంచనపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు నాగం ఫౌండేషన్ నల్లగొండ వారి సహకారంతో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు,మందులు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు డా.నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ మా నాగం హాస్పిటల్ ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలందరూ వినియోగించి కోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ పకీర్ మోహన్ రెడ్డి,జిల్లా దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నర్సింహా,శివ,వంశీ, ప్రశాంత్,డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి,డాక్టర్ సోంబాబు,డాక్టర్ సందీప్ గౌడ్,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.