ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండల అధికార యంత్రాంగ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలకు సేవలు అందించుటలో మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని రెవెన్యూ, మండల పరిషత్,ఎమ్మార్సీ కార్యాలయాలు,అంగన్వాడి కేంద్రాన్ని,కోటి నాయక్ తండా,దుబ్బతండాలో నర్సరీలు,పల్లె ప్రకృతి వనాలు,ఉపాధి హామీ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 Collector Surprise Visit To Atmakur(s) Mandal , Atmakur,note Books, Uniforms-TeluguStop.com

పల్లె ప్రకృతి వనాలని పరిశీలించి నీడనిచ్చే మొక్కలు కాకుండా పండ్లనిచ్చే మొక్కలు నాటాలని సూచించారు.మొక్కల పెంపకంలో నిర్లక్ష్యంగా ఉన్న ఏపీఓఫై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధి కూలీలతో మాట్లాడుతూ రోజువారిగా ఎంత వేతనం చెల్లిస్తారని టెక్నికల్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిని అడగగా మాకు తెలియదని చెప్పడంతో వారిపై మండిపడ్డారు.ఉపాధి కూలీలకు రోజుకు ఎంత కూలీ చెల్లిస్తామన్నది తెలియజేయాలని,24 గంటల్లో పల్లె ప్రకృతి వనంలో పండ్ల మొక్కలు నాటాలని ఆదేశించారు.

అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డుల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రికార్డులన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయని, చినిగిపోయే విధంగా ఉన్నా ఎందుకు ఆన్లైన్ చేయలేదని తాహశీల్దార్ పై సిరియస్ అయ్యారు.

ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను అడిగి, వెంటనే పరిష్కరించాలన్నారు.రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారిని మీకు ఏ రోజు స్లాట్ బుక్ అయింది అని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల,విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు.పాఠశాలలో 13 మంది ఉపాధ్యాయులకు 75 మంది విద్యార్థులే ఉండడంతో ప్రధానోపాధ్యాయున్ని మందలించారు.

ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల,ఉపాధ్యాయుల హాజరు శాతం పరిశీలించి,విద్యార్థులకు యూనిఫారం ఇవ్వకపోవడంపై ఎంఈఓ ధారసింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాలలో ఉపాధ్యాయురాలు తెల్ల పేపర్ పై ముందస్తు సంతకం చేసి ఉంచడం చూసి కలెక్టర్ తీవ్ర అగ్రహనికి గురై,ఇలా చేయడం సరికాదని మందలించారు.

అనంతరం ఎమ్మార్సీని సందర్శించగా ఎమ్మార్సీలో పుస్తకాలు, నోటు బుక్స్,యూనిఫామ్స్ ఉండడంతో విద్యార్థులకు అందించవలసిన ఎమ్మార్సీలో ఎందుకు ఉంచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పిల్లల,గర్భిణీల హాజరు శాతాన్ని పరిశీలించి, స్టాక్ రిజిస్టర్ అడగగా ఇక్కడ లేదని ఇంటి వద్ద ఉందని ఆంగన్ వాడి కార్యకర్త సమాధానం చెప్పడంతో మండిపడ్డారు.

రేపు ఉదయం స్టాక్ రిజిస్టర్ తో తన ఛాంబర్ లో కలవాలని ఆదేశించారు.దుబ్బతండా,కోటి నాయక్ తండాలలో ఉపాధి కూలీలతో కాసేపు ముచ్చటించి పెన్షన్ వస్తున్నదా,రేషన్ సరిగా అందుతుందా లేదా బియ్యంకు బదులు డబ్బులు తీసుకుంటున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.పిల్లలను ప్రభుత్వ పాఠశాలలను చదివించాలని తెలిపారు.కలెక్టర్ వెంట ఎంపీడీవో హాసిం,తహసీల్దార్ వినోద్ కుమార్,ఎంఈఓ ధారసింగ్,ఎంపీవో సంజీవ, ఏపీఓ ఈశ్వర్,ఏపీఎం మంజుల,సిబ్బంది ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube