తెలంగాణలో రుణమాఫీ పై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy ) ప్రకటన చేయడం జరిగింది.2 లక్షల వరకే రుణమాఫీ చేస్తామని.పంట రుణాలు మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తేల్చి చెప్పడం జరిగింది.రేషన్ కార్డు ( Ration card )కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని తెలియజేయడం జరిగింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండు రోజుల అనంతరం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు.కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేకమైన దృష్టి పెడతామని స్పష్టం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం ప్రతి నెల ఆర్టీసీకి 350 కోట్లకు పైగానే ప్రభుత్వం చెల్లిస్తుందని తెలియజేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నాలుగు రోజులు నుండి ఢిల్లీలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో అధిష్టానం పెద్దలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కావడం జరిగింది.శుక్రవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, నితిన్ గడ్కరీతో వరుస సమావేశాలయ్యారు.
ఈ సమావేశాలలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు అదేవిధంగా పలు అనుమతులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం.