జిల్లాలో జోరుగా ఐపిఎల్ బెట్టింగ్

సూర్యాపేట జిల్లా:2022 మార్చి 26 నుండి ఐపిఎల్ సీజన్ మొదలైన విషయం తెలిసిందే.నాటినుండి నేటివరకు జిల్లాలో జోరుగా బెట్టింగ్ దందా నడుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 Ipl Betting Rampant In The District-TeluguStop.com

ప్రతీ మ్యాచ్ లో టాసు వేసింది మొదలు గెలుపు ఓటముల వరకు,ఆటలో ఒక్కొక్క ఆటగాడిపై, ఒకొక్క బోలర్ వేసే బంతిపై,ఒక్కొక్క బ్యాట్స్ మెన్ కొట్టే షాట్ లపై రకరకాలుగా వేల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం.ఐపిఎల్ పుణ్యాన ఎంతో మంది బెట్టింగులకు బానిసలయ్యి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటే,మరి కొందరు అప్పుల భారం భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఐపీఎల్ సమరం ఫైనల్ స్టేజికి రావడంతో సూర్యాపేట జిల్లాలో జోరుగా బెట్టింగ్ దందా కొనసాగుతోందని విశ్వసనీయ సమాచారం.నేడు ఐపిఎల్ క్రికెట్ లో గుజరాత్,రాజస్థాన్ రాయల్స్ కు చివరి మ్యాచ్ కావడంతో బెట్టింగులు జోరు ఇంకాస్త ఊపందుకుందని,ఉదయం నుండే టాస్ గెలుపు, ఓటములపై బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగులు చేస్తున్నారని,5 వేల నుండి లక్షలాది రూపాయల వరకు బెట్టింగులకు పాల్పడుతున్నారని,లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే జరుపుతున్నారని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube