జిల్లాలో జోరుగా ఐపిఎల్ బెట్టింగ్

సూర్యాపేట జిల్లా:2022 మార్చి 26 నుండి ఐపిఎల్ సీజన్ మొదలైన విషయం తెలిసిందే.

నాటినుండి నేటివరకు జిల్లాలో జోరుగా బెట్టింగ్ దందా నడుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రతీ మ్యాచ్ లో టాసు వేసింది మొదలు గెలుపు ఓటముల వరకు,ఆటలో ఒక్కొక్క ఆటగాడిపై, ఒకొక్క బోలర్ వేసే బంతిపై,ఒక్కొక్క బ్యాట్స్ మెన్ కొట్టే షాట్ లపై రకరకాలుగా వేల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

ఐపిఎల్ పుణ్యాన ఎంతో మంది బెట్టింగులకు బానిసలయ్యి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటే,మరి కొందరు అప్పుల భారం భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఐపీఎల్ సమరం ఫైనల్ స్టేజికి రావడంతో సూర్యాపేట జిల్లాలో జోరుగా బెట్టింగ్ దందా కొనసాగుతోందని విశ్వసనీయ సమాచారం.

నేడు ఐపిఎల్ క్రికెట్ లో గుజరాత్,రాజస్థాన్ రాయల్స్ కు చివరి మ్యాచ్ కావడంతో బెట్టింగులు జోరు ఇంకాస్త ఊపందుకుందని,ఉదయం నుండే టాస్ గెలుపు, ఓటములపై బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగులు చేస్తున్నారని,5 వేల నుండి లక్షలాది రూపాయల వరకు బెట్టింగులకు పాల్పడుతున్నారని,లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే జరుపుతున్నారని టాక్.

ఎన్నికల తరువాత కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..: మంత్రి ఉత్తమ్