ప్రభుత్వ అగ్రికల్చర్ గోడౌన్ దగ్ధం...!

నల్గొండ జిల్లా: కేతేపల్లి మండలం ఇప్పలగూడెం, గుడివాడ గ్రామల పరిధిలోని ఐకెపి గోడౌన్లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఐకెపి, పిఏసిఎస్,వడ్ల ధాన్యం కొనుగోలుకి ఉపయోగించే గన్ని సంచులు అగ్నికి ఆహుతయ్యాయి.

 Government Agriculture Godown Fire Nalgonda District Details, Government Agricul-TeluguStop.com

భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.వెంటనే స్పందించిన అధికారులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు.

Telugu Latest, Sudheer, Suryapet, Telugudistricts-Suryapet

అగ్ని ప్రమాదంలో మొత్తం గోడౌన్ సముదాయంలో నిలువ ఉంచిన 5,68,851 గన్ని బ్యాగులు కాలి బూడిద అయ్యాయని,సుమారు మూడు కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లునట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.ఈ అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరిపిపూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube